కురవని ఆకాశ కింద నిర్జీవుల పాట
నీది, నాది వాదులాట మధ్య నిర్హేతుక క్రీడ
పగలు, రాత్రి మధ్య తెగని పోరాటం
ఎన్నో రాత్రులు కుత్రిమత్వాన్ని ప్రోది చేసుకున్న మనో వికారం
ఎవరో, ఏమిటో... ఎక్కడో, ఏదో పారవేసుకున్న పారిజాతం
ఎన్ని పరిమళాలను పంచినా తొలగదు భయం
రోజూ ఓ మృత్యుక్రీడే...
రోజూ ఓ అసాంఘిక కాలాపమే..
ఆది అంతం లేని ఓ ప్రాణభం క్షేత్రమా..!!
Comments
Post a Comment